Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టంలేని విధులు (కరోనా) కేటాయించారనీ తుపాకీతో కాల్చుకున్న ఖాకీ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (20:45 IST)
తనకు ఇష్టంలేని విధులు కేటాయించారన్న మనస్తాపంతో ఒక కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. కరోనా వైరస్ దెబ్బకు దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉన్న విషయంతెల్సిందే. ఈ కరోనా విధుల్లో వైద్యులు, పోలీసులు, పారిశ్రామికసిబ్బంది రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. 
 
వేళకు తిండి లేకుండా, ఎక్కడ ఏది దొరికితే అది తింటూ, ఇంటిని వదిలి విధులకే అంకితమయ్యారు. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. భోపాల్‌లో విధులు నిర్వర్తిస్తున్న చేతన్ సింగ్ అనే 36 ఏళ్ల కానిస్టేబుల్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకున్నాడు. దాంతో సహచరులు వెంటనే అతడ్ని భోపాల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా, ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. 
 
ఇకపోతే, చేతన్ సింగ్ తనకు కరోనా విధులు కేటాయించడంతో పైఅధికారుల పట్ల అసంతృప్తితో ఉన్నట్టు అతని అనుచరులు చెబుతున్నారు. విధి నిర్వహణలో తనకు కూడా కరోనా సోకుతుందేమోనని భయంతో విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా పెద్దగా పట్టించుకోలేదు. 
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ కానిస్టేబుల్ తొలుత గాల్లోకి కాల్పులు జరిపి ఆ తర్వాత తన ఎడమ చేతిని గురిపెట్టుకుని కాల్చుకున్నాడు. అయితే, అదృష్టవశాత్తు ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కాగా, భోపాల్‌లో ఇప్పటికే పది మంది కానిస్టేబుల్స్ కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments