రైలు జర్నీ : ఈ వెబ్‌సైట్లలో ఫుడ్ ఆర్డర్ చేయొద్దు : భారతీయ రైల్వే శాఖ

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (09:21 IST)
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ హెచ్చరిక చేసింది. ప్రయాణ సమయంలో అవసరమయ్యే ఆహార పదార్థాల కోసం వెబ్‌సైట్లలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇలాంటి వారికి రైల్వే శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఫుడ్ డెలివరీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రైలు ప్రయాణికులను హెచ్చరికలు చేస్తూనే, అనధికారికంగా ఫుడ్ ఆర్డర్స్ తీసుకుని, ఆహార పదార్థాలను డెలివరీ చేస్తున్న వెబ్‌సైట్ల జాబితాను రైల్వే శాఖ వెల్లడించింది. ఈ - కేటరింగ్ వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని సూచన చేసింది. అలాగే, అనధికారింగా ఫుడ్ డెలివరీ చేస్తున్న వెబ్‌సైట్ల జాబితాను కూడా ఈ-కేటరింగ్ సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 
 
ఇలాంటి వెబ్ సైట్లలో రైల్ రెస్ట్రో, రైలు మిత్ర, ట్రావెల్ ఖానా, రైల్ మీల్, దిబ్రెయిల్, ఖానా ఆన్‌లైన్, ట్రైన్స్ కేఫ్, ఫుడ్ ఆన్ ట్రాక్, ఈ-కేటరింగ్, ట్రైన్ మెనూ వంటి వెబ్‌సైట్లు ఉన్నాయి. ఈ వెబ్ సైట్లలో ఎలాంటి ఆహార పదార్థాలను ఆర్డర్ చేయొద్దని సూచించింది. 
 
అలాగే, ఐఆర్‌సీటీసీ ఈ-కేటింగ్ వెబ్‌సైట్ల ద్వారా ఆర్డర్ చేయాలని సూచింది. ఈ వెబ్‌సైట్లలోకి వెళ్లి రైలు వివరాలు లేదా స్టేషన్ వివరాలు ఎంటర్ చేయాలని, ఆ తర్వాత పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేసి మీకు నచ్చిన ఫుడ్‌ను ఎంచుకోవాలని సూచించింది. పే ఆన్ లైన్, క్యాష్ ఆన్ డెలివరీ.. ఈ రెండు ఆప్షన్‌లో డబ్బులు చెల్లించాలని తెలిపింది. అలాగే, 1323 అనే నంబరుకు కాల్ చేసినా లేదా 91-8750001323 అనే వాట్సాప్ నంబరు ద్వారా ఆర్డర్ కూడా చేయొచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments