Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి హేమ పాల్గొన్నారు... ఆ వీడియోపై విచారణ జరుపుతున్నాం : బెంగుళూరు సీపీ

ఠాగూర్
మంగళవారం, 21 మే 2024 (16:15 IST)
ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరులో ఆ నగర పోలీసులు గుట్టురట్టు చేసిన రేవ్ పార్టీ వివరాలను బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలని చెప్పారు. ఇందులో తెలుగు సినీ నటి హేమతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారని చెప్పారు. 
 
ఈ రేవ్ పార్టీకి సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని పేరు పెట్టారని తెలిపారు. ఆ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఒకరని చెప్పారు. అయితే, తాను పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్‌లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్న దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.  
 
ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్టు చేశామని తెలిపారు. ఇందులో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు. బెంగుళూరు నగర శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించి ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా తెలులుగు బుల్లితెర నటీనటులు, మోడళ్లు పాల్గొన్నట్టు గుర్తించామని, ఈ రేవ్ పార్టీ ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేశారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments