Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడు ప్రమాదకర రీల్స్ ... ఆగ్రహంతో స్కూటర్ లాక్కొని వంతెనపై నుంచి కిందపడేశారు.. (Video)

ఠాగూర్
ఆదివారం, 18 ఆగస్టు 2024 (16:28 IST)
ఇటీవలి కాలంలో రీల్స్, సెల్ఫీల మోజులో అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. రీల్స్ కోసం ప్రమాదకరంగా స్టంట్స్ చేయడం, జలపాతాల వద్దకు వెళ్లడం కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటువంటి ఘటనలు సంబంధించి వార్తలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా యువతలో మార్పు రావడం లేదు. 
 
తాజాగా బెంగుళూరు - తుముకూరు జాతీయ రహదారిపై రోడ్డు మధ్యలో స్కూటర్‌తో ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తున్న యువకుడికి స్థానికులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని అడ్డుకుని వాహనాన్ని లాక్కుని వంతెనపై నుంచి కిందకు పడేశారు. అంతెత్తు నుంచి రోడ్డుపై పడటంతో ఆ స్కూర్ కాస్త తుక్కుతుక్కు అయింది. యువకుడు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేయడంతో ఇతర వాహనదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. అందరూ కలిసి అతడిని అడ్డుకుని స్కూటర్ లాక్కొని వంతెనపై నుంచి అమాంతం ఎత్తిపడేశారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే ఇంకొకటి జరిగింది. ఓ యువతి ఆరో అంతస్తు నుంచి రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా చేతిలోనుంచి మొబైల్ జారిపోయింది. దీంతో దానిని పట్టుకునే ప్రయత్నంలో ఆ యువతి అదుపుతప్పి కందపడి ఆమె తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments