వెస్ట్ బెంగాల్ రాజ్‌భవన్‌లో పేలుడు పదార్థాలు నిల్వ చేశారా?

ఠాగూర్
సోమవారం, 17 నవంబరు 2025 (18:57 IST)
వెస్ట్ బెంగాల్ రాజ్‌భవన్‌లో పేలుడు పదార్థాలను భారీగా నిల్వ చేశారంటూ ప్రచారం సాగింది. ఈ విషయంపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఇవి చర్చనీయాంశంగా మారాయి. వీటిని తీవ్రంగా పరిగణించిన గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సోమవారం రాజ్‌భవన్‌ భద్రతా సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేయించారు.

ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నిల్వ చేశారా అని గుర్తించేందుకు కోల్‌కతా పోలీులు, కేంద్ర బలగాలు, బాంబు నిర్వీర్య, డాగ్ స్క్వాడ్‌లతో కూడిన బృందానికి గవర్నర్ బోస్ సారథ్యం వహించారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 
 
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు ఎస్‌ఐఆర్‌ ఎంతో అవసరమని శనివారం గవర్నర్‌ వ్యాఖ్యానించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే గవర్నర్‌, రాజ్‌భవన్‌ను టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ లక్ష్యంగా చేసుకున్నారు. 
 
'రాజ్‌భవన్ లోపల భాజపా నేరస్థులకు గవర్నర్‌ ఆశ్రయం కల్పించారు. వారికి బాంబులు, తుపాకులు సమకూర్చారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో గవర్నర్‌.. ఉత్తర బెంగాల్‌లో తన పర్యటనను కుదించుకుని రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే తనిఖీలకు నేతృత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments