Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేట్ల‌కు తాయిలాలు...‌ ఉద్యోగులకు కోత‌లా?: ఆలిండియా బిఎస్ ఎన్ ఎల్ పింఛ‌నుదారుల సంక్షేమ‌ సంఘం

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (18:40 IST)
కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ఉద్యోగులు, పింఛ‌నుదారుల‌కు డి.ఎ. నిలిపివేయ‌డంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. కోవిడ్ పేరుతో కార్పొరేట్ల‌కు తాయిలాలు ప్ర‌క‌టిస్తున్న కేంద్రం, సామాన్య ఉద్యోగులు, పింఛ‌నుదారుల డి.ఎ.ని నిలిపివేయ‌డం అన్యాయ‌మ‌ని, ఆలిండియా బి.ఎస్.ఎన్.ఎల్. పెన్ష‌న‌ర్స్ వెల్పేర్ అసోసియేష‌న్ ఏపీ స‌ర్కిల్ కార్య‌ద‌ర్శి వి.వ‌ర‌ప్ర‌సాద్ విమ‌ర్శించారు.

ఈ ఏడాది అక్టోబ‌రు నుంచి 2021 జూన్ వ‌ర‌కు రావాల్సిన డి.ఎ.ని ర‌ద్దు చేస్తూ, కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. కోవిడ్ పేరిట కార్పొరేట్ కంపెనీల‌కు రాయితీలు ప్ర‌క‌టిస్తున్న కేంద్రం, ప్ర‌స్తుత కోవిడ్ క్లిష్ట స‌మ‌యంలో సామాన్య ఉద్యోగుల‌పై వివ‌క్ష చూప‌డం దారుణ‌మ‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వ‌ రంగ సంస్థ‌ల్లో (సి.పి.ఎస్. ఇ) 10 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌కు,  2 ల‌క్ష‌ల మంది బి.ఎస్.ఎన్.ఎల్, ఎం.టి.ఎన్.ఎల్ పింఛ‌నుదారుల‌కు దీని వ‌ల్ల న‌ష్టం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.

కోవిడ్ వ‌ల్ల ఆరోగ్యం క్షీణించి... ఇప్ప‌టికే నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రిగి పింఛ‌నుదారుల జీవ‌నం దుర్భ‌రంగా మారుతున్న త‌రుణంలో డి.ఎ. నిలుపుద‌ల చేయ‌డం సమంజ‌సం కాద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉత్త‌పెర్వుల‌ను తీవ్రంగా నిర‌సిస్తున్నామ‌ని, వెంట‌నే సిపిఎస్ఇ. ఉద్యోగుల డి.ఎ. నిలుపుద‌ల ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments