Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోడ్డు ర‌వాణా సంస్థ‌లో ఉద్యోగుల ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయం

రోడ్డు ర‌వాణా సంస్థ‌లో ఉద్యోగుల ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయం
, శుక్రవారం, 24 జులై 2020 (07:08 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో ప‌నిచేస్తున్న మెకానిక్ ఉద్యోగులు అత్యంత ద‌య‌నీయ స్థితిని ఎదుర్కొంటున్నార‌ని, యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి వేత‌నాలు పెంచాల‌ని పీఆర్సీ ఛైర్మ‌న్‌కు అభ్యుద‌య ఎంపాయీస్ అసోసియేష‌న్ (ఏఈఏ) ప్ర‌తినిధులు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ ఆర్టీసీ హౌస్‌లో పీఆ‌ర్సీ ఛైర్మ‌న్ ఆస్‌తోష్ మిశ్రా‌తో వారు వీడియో కాన్ఫ‌రెన్స్ (వీసీ)లో పాల్గొన్నారు.

అసోసియేషన్ రాష్ట్ర అధ్య‌క్షుడు గుర్రం శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ షేక్ మొహమ్మద్ రఫీ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.హెచ్.ప్రసాద్, రాష్ట్ర వ్య‌వ‌హారాల కార్యదర్శి బి.సురేష్ నాయక్, చైర్మన్ కే.వి.సుబ్బారావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ పి.కిరణ్‌కుమార్, రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ కే.వి.సుబ్బారెడ్డి త‌దిత‌రులు వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఏఈఏ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు మాట్లాడుతూ ముందుగా ప్ర‌భుత్వంలో త‌మ‌ను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చినందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి కృత‌‌‌జ్ఞతలు తెలిపారు. జీతభత్యాల‌కు సంబంధించి సిబ్బందికి అతితక్కువ వేత‌నంతో పాటు అలవెన్సులు కూడా అతి తక్కువగా వ‌స్తున్నందున ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని కమీష‌న్‌కు తెలియపరిచారు.

మినిమం బేసిక్స్ రూ.35వేలు ఉండాలని, మెయింటినెన్స్ సిబ్బందికి రిస్క్ అలవెన్స్ రూపేణా రూ.3వేలు, వాషింగ్ అలవెన్సు రూ.500, నైట్ షిఫ్ట్ అలవెన్స్ రోజుకు రూ.500 చొప్పున ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు విష‌యంలో మెకానిక్ అసిస్టెంట్లకు టెస్టుల పేరుతో కొన్ని రీజియన్‌ల‌లో ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కమిషన్‌కు వివరించారు.

అదేవిధంగా మెకానిక్ అసిస్టెంట్ల‌ను క్లాస్-3 కింద గుర్తించాలని, చనిపోయిన సిబ్బంది పిల్లలకి లేదా వారి కుటుంబ సభ్యులకు 2004 నుండి మిగిలిపోయిన సుమారు 1200 మంది ఉద్యోగుల పిల్లలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా తక్షణం ఉద్యోగాలు ఇవ్వాలని, ఇప్పటికే ఇచ్చిన జీవోకి మార్పులు చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా జీవోను పునరుద్ధ‌రించాల‌ని డిమాండ్ చేశారు.

గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ఈ ఏడాది జ‌న‌వ‌రి 1వ నుండి అమల్లోకి రావాల్సి ఉండగా టిఆర్‌అండ్‌బి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని డిజిగ్నేష‌న్‌ను మార్చాలని కోరారు. మెయింట్‌నెన్స్  విభాగంలో సిబ్బందికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని కూడా కమిషన్ దృష్టికి తీసుకువ‌చ్చారు.

గతంలో  కార్పొరేషన్‌లో చిన్న రిమార్కుల‌కి సస్పెండ్ రిమూవ్ చేసి సిబ్బందికి అన్యాయం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారులు త‌మ‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తే ప్ర‌యాణికుల‌కు సౌకర్యాలతో కూడిన బస్సులతో సేవలు అందించేందుకు తాము నూరు శాతం కృషి చేస్తామన్నారు.

కృష్ణా జిల్లా ఉయ్యూరు డిపోలో చనిపోయిన తాలూకు ఇచ్చిన ఉద్యోగాల్లో ఇనిషియల్ అపాయింట్మెంట్‌లో కాంట్రాక్టు పద్ధతిలో ఇచ్చారని వారికి స్టార్టింగ్ నుంచి రెగ్యులర్‌గా ఇస్తూ న్యాయం చేయాలని కమిషన్‌కు వివ‌రించారు.

వినుకొండ డిపోలో ఒక ఉద్యోగి చనిపోతే ఆయ‌న కుమారుడికి కండక్టర్‌గా మెడికల్ అన్ఫిట్ అయ్యారని 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం ఇవ్వడం లేద‌ని, మెకానిక్ అసిస్టెంట్‌గా చేర్చుకునేందుకు అవ‌కాశం ఉన్నప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా చ‌నిపోయిన ఉద్యోగి కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని తెలిపారు.

త‌మ న్యాయ‌మైన డిమాండ్లతో కూడిన విన‌తి ప‌త్రాన్ని ఇప్ప‌టికే ఆర్టీసీ చైర్మన్‌, ఎండీ, ఈడిఏల‌కు అంద‌జేశామ‌న్నారు. గ‌తంలో టైర్ మెకానిక్ స్టార్టింగ్ అపాయింట్మెంట్ గ్రేడ్ వన్‌గా పోస్టింగ్ ఇచ్చిన సంద‌ర్భాలున్నాయ‌ని అదే ఆనవాయితీని ఇకపై కొనసాగించాలని, మెయింటినెన్స్‌ విభాగం అత్యంత కష్టమైన పనిగా గుర్తించి గ్రేడ్ వన్ అమలుపరచాలని పీఆర్సీ ఛైర్మ‌న్ దృష్టికి ఏఈఏ ప్ర‌తినిధులు తీసుకెళ్లారు. కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ త‌ర‌ఫున పీవోఐటి జ‌య‌శంక‌ర్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసుల మానవత్వం.. మృతదేహానికి అంత్యక్రియలు