Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వలింగ సంపర్కులపై స్వామి ఏమన్నారు..? బీజేపీ అది అచ్చి రాదట..!

స్వలింగ సంపర్కులను క్రిమినల్స్‌గా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377పై మరోసారి వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధమైన తరుణంలో స్వలింగ సంపర్కంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఏడుగురు ల

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (17:35 IST)
స్వలింగ సంపర్కులను క్రిమినల్స్‌గా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377పై మరోసారి వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధమైన తరుణంలో స్వలింగ సంపర్కంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఏడుగురు లేదా తొమ్మిది మందితో కూడిన విస్తృత ధర్మాసనం ఈ పిటిషన్‌కు సంబంధించిన వాదనలను వింటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
స్వలింగ సంపర్కం సహజమైన ప్రక్రియ కాదని, హిందుత్వానికి ఇది పూర్తిగా వ్యతిరేకమని స్వామి వ్యాఖ్యానించారు. .. స్వలింగ సంపర్కం నుంచి జనాలు బయటపడేందుకు మెడికల్ రీసర్చ్ ద్వారా మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వలింగ సంపర్కులను చూసి ఆనందించడం కానీ, వారికి మద్దతు పలకడం కానీ సరైన చర్య కాదన్నారు.
 
మరోవైపు బీజేపీని అధికారంలోకి తెచ్చేది హిందుత్వ అజెండానేనని సుబ్రహ్మస్వామి తెలిపారు. మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో 'ఇండియా షైనింగ్' నినాదంతో ఎన్నికల బరిలోకి బీజేపీ దిగిందని.. కానీ, ఓటమిపాలైందని గుర్తుచేశారు. అలాగే బీజేపీకి అభివృద్ధి నినాదం పని చేయదని తెలిపారు. గత ఎన్నికల్లో హిందుత్వ స్థాపన, అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో బీజేపీ ఎక్కువ సీట్లను సాధించిందని చెప్పారు. 
 
బీజేపీకి మరో ఐదేళ్ల పాటు అధికారాన్ని ఇస్తే తన ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేరుస్తుందని స్వామి చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పారు. ఒకవేళ పీడీఎఫ్‌లో హిందువు కానీ, సిక్కు కానీ ఉంటే... వారినే సీఎం చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments