Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేల్చిన పన్నీర్ సెల్వం... అమ్మ మృతికి కారణం ఎవరో నాకు తెలుసు

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతికి కారణం ఎవరో తనకు తెలుసని, అన్ని నిజాలను బహిర్గతం చేస్తానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచ

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (09:17 IST)
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతికి కారణం ఎవరో తనకు తెలుసని, అన్ని నిజాలను బహిర్గతం చేస్తానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా జయలలిత అనారోగ్యం గురికావడం వెనుక, ఆస్పత్రిలో చికిత్స, మరణం, తదనంతర రాజకీయాలపై దేశ, రాష్ట్ర ప్రజలకు వివరిస్తారనని చెప్పారట. దీంతో పన్నీర్ సెల్వం ఏం మాట్లాడతారో అని ప్రజలతో పాటు శశికళ శిబిరం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇదే విషయంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని నిజాలను బహిర్గతం చేయనున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు ఓపీఎస్ తమ గురించి ఎలాంటి బాంబు పేలుస్తారోనన్న భయంతో శశికళ వర్గంతో పాటు మన్నార్గుడి మాఫియాగా పేరొందిన శశికళ బంధుగణం బెంబేలెత్తిపోతోందట. ఈ ప్రెస్‌మీట్ ద్వారా రాష్ట్రంలో మంచి పరిణామం జరగబోతోందని, త్వరలో మంచి ప్రభుత్వం వస్తుందని పన్నీర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. 
 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని అవకాశాలు తమకున్నాయని.. జయ ఆశీర్వాదం మాకుందని చెప్పారు. అంతేకాదు, చికిత్స సమయంలో అమ్మను ఒక్కసారంటే ఒక్కసారి కూడా తనను చూడనివ్వలేదని, కనీసం కలిసేందుకు కూడా అనుమతించలేదని, వైద్యులు చెప్పిన విషయాలనే తాను బయటకు చెపుతూ వచ్చానని పన్నీర్ సెల్వం వాపోయినట్టు చెపుతూ వచ్చారు. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments