Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పన్నీర్'కు శశికళ అండ... ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి... పెరుగుతున్న నేతల మద్దతు

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకు శశికళ మద్దతు ప్రకటించారు. శశికళ అంటే.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కాదు. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప. దీంతో పన్న

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (08:55 IST)
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకు శశికళ మద్దతు ప్రకటించారు. శశికళ అంటే.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కాదు. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప. దీంతో పన్నీర్ సెల్వంకు మద్దతునిచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్.. పన్నీర్‌కు అండగా నిలిచిన విషయం తెల్సిందే. అలాగే, మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, ఉంగళుక్కాగ ట్రస్ట్‌ డాక్టర్‌ సునీల్‌, ఎమ్మెల్యేలు ఆర్‌.కుట్టి, మాణిక్యం, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మద్దతు ప్రకటించారు. 
 
అలాగే, ఇండియా జననాయగ కట్చి (ఐజేకే), నామ్‌ తమిళర్‌ కట్చి నిర్వాహకుడు సీమాన్, పీఎంకే రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ తదితరులు కూడా మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి వీకే శశికళ ముఠా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఆ ముఠా వల్లే తాను పార్టీకి దూరమయ్యానన్నారు.
 
ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని తనను ఇబ్బందులు పెట్టినట్టే ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంను కూడా రాజీనామా చేయాలని శశికళ బృందం ఒత్తిడి చేసిన ప్రజలు గుర్తించారన్నారు. పన్నీర్‌ సెల్వంకు మెజార్టీ నిరూపించుకొనేందుకు రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ విద్యాసాగరరావు అవకాశం కల్పించాలని, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె కోరారు. 
 
ఐజేకే కార్యాచరణ అధ్యక్షుడు రవి పచ్చముత్తు పన్నీర్‌ సెల్వంకు మద్దతు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన రాజకీయ వారసులుగా ఎవరినీ ప్రకటించలేదని, అయితే ఆమె ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సీఎం పదవిని పన్నీర్‌సెల్వంకు కట్ట బెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా వ్యవహరించారన్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments