Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పదోషం.. ఐదుసార్లు తాళికట్టుకోవాలి.. ఐదుసార్లు శోభనం..

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (10:25 IST)
టెక్నాలజీ పెరిగినా మూఢనమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చినా.. దొంగ బాబాల వెనుక పరుగులు తీసే జనం అధికమవుతూ వున్నారు. తాజాగా ఓ దొంగబాబా చేతికి ఓ మహిళ చిక్కుకుంది. 
 
సర్పదోషం వుందని పూజ చేయాలని ఐదుసార్లు తాళి కట్టించుకుని, ఐదుసార్లు శోభనంలో పాల్గొనాలని నమ్మించిన బాబా బాగోతం బయటపడింది. సర్పదోషం పేరిట మహిళను లోబరుచుకోవాలనుకున్న ఈ ఇద్దరు బాబాలను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉండే ఓ మహిళ బాణసవాడిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గొడవల కారణంగా భర్తతో విడిపోయిన ఆమెకు సర్పదోషం ఉందని ఇటీవల ఎవరో చెప్పారు. 
 
దాంతో సర్పదోష నివారణ కోసం పరిచయస్తుడైన జగన్నాథ్‌ను సంప్రదించింది. కామస్వామి గణేష్, మణికంఠ అనే ఇద్దరు స్వాములను జగన్నాథ్ పరిచయం చేశాడు. వీరిద్దరు తండ్రీకొడుకులు సర్ప దోష నివారణకు పూజ చేయాలని చెప్పి రూ.40వేలు వసూలు చేశారు.
 
పూజ అనంతరం మరో ప్రక్రియ ఉందని చెప్పి.. తమతో ఐదుసార్లు తాళి కట్టించుకుని, ఐదుసార్లు శోభనంలో పాల్గొనాలని నమ్మించారు. ఇందుకోసం ఓ హోటల్‌లో గదులు కూడా బుక్ చేశారు. ఇంతలోనే విషయం బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments