Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడి కోసం తండ్రిని దారుణంగా హత్య చేసిన కుమార్తె..

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (11:21 IST)
చదువుకునేది తొమ్మిదో తరగతి తండ్రిని చంపేసింది. ప్రేమ కోసం తండ్రినే చంపుకుంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు రాజాజీనగర ఐదో బ్లాక్‌‌లో ఓ వ్యాపారి నివాసం ఉంటున్నాడు. తొమ్మిదో తరగతి చదివే కుమార్తె వుంది. ఆమె తన ఇంటికి సమీపంలోనే ఉంటూ బీకామ్ చదువుకుంటున్న ప్రవీణ్‌ అనే యువకుడితో చనువుగా ఉండేది. 
 
ప్రవీణ్ పదేపదే తమ ఇంటికి రావడాన్ని చూసిన ఆమె తండ్రి వారించాడు. దీంతో ఆ బాలిక తండ్రిపై కోపం పెంచుకుంది. అతను ఉంటే తమ పరిచయం కొనసాగదని భావించి, అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం పక్కా స్కెచ్ వేసింది. గత ఆదివారం నాడు తన తల్లి, తమ్ముడు పాండిచ్చేరికి బయలుదేరుతుంటే, వారిని దింపివస్తానని చెప్పి రైల్వే స్టేషన్‌కు బయలుదేరిన ఆమె, వెళుతూ వెళుతూ తండ్రికి నిద్రమాత్రలు కలిపిన పాలను ఇచ్చింది. 
 
ఇద్దరినీ రైల్లో పంపి వచ్చేసరికి, తండ్రి నిద్రపోతుంటే, ప్రియుడైన ప్రవీణ్‌ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి ఆయన్ను విచక్షణారహితంగా గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచి చంపేశారు. మృతదేహాన్ని బాత్ రూమ్‌లో పడేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే, కొంత పెట్రోల్ వారిపైనా పడటంతో మంటలు విస్తరించాయి. దీంతో బాలిక మిద్దెపైకి ఎక్కి కేకలు పెట్టింది. 
 
చుట్టుపక్కలవారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటల్ని ఆర్పి, గాయపడ్డ ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. తొలుత తాము బయటకు వెళ్లి టిఫిన్ చేసి వచ్చేసరికి మంటలు అంటుకున్నాయని చెప్పిన ఆమె, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆసలు నిజాన్ని అంగీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments