Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి 2010 మంది ఉగ్రవాదుల చొరబాటు... భారీ విధ్వంసానికి ప్లాన్ : బంగ్లాదేశ్ రిపోర్టు

భారత్‌లోకి రెండు వేల మంది పైచిలుకు ఉగ్రవాదులు చొరబడినట్టు పొరుగుదేశం బంగ్లాదేశ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో కేంద్ర హోంశాఖతో పాటు... నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (09:07 IST)
భారత్‌లోకి రెండు వేల మంది పైచిలుకు ఉగ్రవాదులు చొరబడినట్టు పొరుగుదేశం బంగ్లాదేశ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో కేంద్ర హోంశాఖతో పాటు... నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఉగ్రవాదుల చొరబాటు అంశం భారత్‌లో కలకలం రేపింది. ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించిన పక్కా ఆధారాలను బంగ్లాదేశ్ సర్కారు సమర్పించడం గమనార్హం. 
 
భారత్‌లో చొరబడిన ఉగ్రవాదులంతా జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ), హర్కత్-ఉల్-జిహాదీ అల్ ఇస్లామీ (హుజీ) సంస్థలకు చెందిన సభ్యులని ఆ నివేదికలో పేర్కొంది. వీరంతా గత యేడాది తమ దేశ సరిహద్దుల మీదుగా వెస్ట్ బెంగాల్, అస్సోం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారని తెలిపింది. 
 
భారత్‌‌లోకి ప్రవేశించిన 2,010 మంది ఉగ్రవాదుల్లో 1,290 మంది అసోం, త్రిపుర రాష్ట్రాలకు, మిగతా వారు వెస్ట్ బెంగాల్‌కు వెళ్లినట్టు పేర్కొంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా దళాలను రంగంలోకి దించింది. అలాగే, ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments