Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు అమ్మ... నేడు బాబాయ్... రాజకీయ నిరుద్యోగులుగా మార్చిన జగన్ : మంత్రి కేఈ విసుర్లు

రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహానేత దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో స్వయానా వైఎస్ సోదరుడ

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (08:57 IST)
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహానేత దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో స్వయానా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇది వైఎస్ కుటుంబంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. 
 
దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్‌ వివేకానందరెడ్డికి తన సానుభూతిని తెలుపుతున్నట్టు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 'స్థానిక ప్రజా ప్రతినిధుల కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఆయనకు సీటు ఇచ్చి ఉంటే ఈ అవమానం ఉండేది కాదన్నారు. 
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కావాలనే వివేకాను ఈ ఎన్నికల్లో నిలబెట్టినట్లు తెలుస్తోందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ సతీమణి, జగన్ తల్లి వైఎస్.విజయమ్మను విశాఖలో పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ఆమె రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు. ఇప్పుడు బాబాయ్‌ను ఈ ఎన్నికల్లో ఓడించిన జగన్... రాజకీయ నిరుద్యోగిగా మార్చేశారు' అంటూ విమర్శించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments