Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ కొనిస్తామని నమ్మించి సామూహిక అత్యాచారం

బెంగుళూరులో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు యువకులు ఓ యువతికి మాయమాటలు చెప్పి.. బైక్ తీసిస్తామని నమ్మించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (10:43 IST)
బెంగుళూరులో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు యువకులు ఓ యువతికి మాయమాటలు చెప్పి.. బైక్ తీసిస్తామని నమ్మించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బెంగుళూరు మహాలక్ష్మీలేఔట్‌కు చెందిన ఓ యువతికి ముగ్గురు యువకులు ఆరు నెలల క్రితం పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమెకు బైక్ కొనిస్తాని ఆశచూపించారు. అలా.. వారి మాటలు నమ్మి వెంట వెళ్లింది. ఆమెను మండ్య, తుమకూరు ప్రాంతాల్లో ఆమెను తిప్పుకొని చివరికి అదునుచూసి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
చివరకు తాను మోసపోయానని తెలుసుకోవడానికి ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. ఆపై సమాజానికి భయపడి నోరు మెదపకుండా మిన్నకుండిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల దుండగుల్ని ఓ దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేసి విచారించారు. 'విచారణ దెబ్బ'కు సామూహిక అత్యాచారం నేరాన్నీ అంగీకరించారు. 
 
ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడింది మహాలక్ష్మీ లేఔట్‌‌కు చెందిన భరత్‌, ప్రమోద్‌, హరీష్‌లుగా గుర్తించి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలిని విచారిస్తే.. పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తేలింది. శుక్రవారం ఆమెను వైద్య పరీక్షల కోసం వైద్యాలయంలో చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments