Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న టెక్కీ భర్త

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (12:56 IST)
భార్య వేధింపులు తాళలేని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఈఘటన దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో జరిగింది. శ్రీనాథ్ (39) అనే టెక్కీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తూ అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. ఈయన పలు బ్యాంకుల్లో అప్పుచేసి ఓ సొంత ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు. అదేక్రంలో ఓ యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.
 
ఆ తర్వాత నుంచి అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. భార్య నిత్యం చేస్తున్న దుబారా ఖర్చులు, వేధింపులు అతనికి మానసిక స్థిమితం లేకుండా చేశాయి. పైగా ఇంటిని తన తండ్రి పేరున మార్చాలంటూ భార్య నుంచి నిత్యం ఒత్తిడి చేయసాగింది. 
 
ఈ వేధింపులతో ఆ టెక్కీ విసిగిపోయాడు. తాను తనువు చాలిస్తేగాని తన విలువేమిటో ఆమెకు తెలిసిరాదనుకున్నాడేమో. ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి ప్రాథమిక ఆధారాల మేరకు భార్య, ఆమె తల్లిదండ్రులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments