Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ అరటి ఆకులకు భలే డిమాండ్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:43 IST)
తమిళనాడులో జనవరి ఒకటో తేదీ నుంచి కొన్ని ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించడం జరిగింది. ముఖ్యంగా హోటళ్లలో ఇది వరకు ప్లాస్టిక్ పేపర్లలో ఆహార పదార్థాలను ప్యాక్ చేస్తుండే వారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ను తమిళనాడులోని అన్నాడీఎంకే సర్కార్ బ్యాన్ చేయడంతో.. ప్రస్తుతం హోటళ్లలో అరటి ఆకులతో ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేస్తున్నారు. దీంతో అరటి ఆకులకు భలే డిమాండ్ పెరిగింది. 
 
తమిళనాడులోనే అరటి ఆకుల ఉత్పత్తి అధికంగా వుంటుంది. కోవై జిల్లా, మేట్టుపాలయంలో అరటి వ్యవసాయం ప్రధానంగా జరుగుతోంది. దాదాపు ఐదువేల ఎకరాల్లో అరటి చెట్ల సాగుబడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడంతో వ్యాపారులు గ్రామాలకు వెళ్లి రోజుకు అరటి ఆకులు కావాలని రిజర్వేషన్ చేసుకుంటున్నారు. దీంతో అరటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
వీటితో పాటు చెట్ల గుజ్జుతో చేసే వస్తువులు, పేపర్ వస్తువులు, పసుపు సంచులకు కూడా తమిళనాడులో గిరాకీ పెరిగింది. తమిళ సర్కారు ప్లాస్టిక్ నిషేధం ఉత్తర్వుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments