Webdunia - Bharat's app for daily news and videos

Install App

భౌతిక దూరంతో గుండెకు చేటు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (22:24 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా భౌతిక దూరం పాటించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా లాంటి  వైరస్‌లు మనుషులు దగ్గరగా ఉన్న సమయంలో ఒకరి నుంచి  ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెప్తుంటారు.

లాక్‌డౌన్‌ సమయంలో మనం నేర్చుకొన్న కొన్ని మంచి విషయాల్లో చేతులు, కాళ్ల పరిశుభ్రతతోపాటు భౌతిక దూరం పాటించడం. అయితే భౌతిక దూరం పాటించడం వల్ల కరోనా లాంటి వైరస్‌లను దూరంగా పెట్టుడు మాటేమోగానీ.. గుండె మాత్రం ఇక్కట్లలో పడిపోతుందంటున్నారు వైద్యనిపుణులు.

సాంఘిక ఒంటరితనం కారణంగా గుండెపోటు, స్ట్రోక్‌ వంటి సమస్యలకు 40 శాతం ఎక్కువ అవకాశాలు ఉన్నాయని  పరిశోధనలో తేలింది. జర్మనీలోని ఎస్సెన్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకుడు ఢాక్టర్‌ జానైన్‌ గ్రోన్‌వోల్డ్‌ ఆధ్వర్యంలో పదమూడేండ్ల పాటు ఈ పరిశోధన కొనసాగింది.

ఇందులో పాల్గొన్నవారికి హృదయ సంబంధ వ్యాధుల గురించి  తెలియకుండా అధ్యయం చేపట్టారు. పరిశోధకులు సగలున 59.1 ఏండ్ల వయసుగల 4,316 మంది నుంచి డేటాను తీసుకొని పరిశీలించారు. వీరిలో నుంచి 339 మంది హార్ట్ అటాక్‌ వంటి కార్డియోవాస్క్యులార్‌ వ్యాధులు, 530 మంది మృత్యువాతకు గురయ్యారు.

సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల హృదయ సంబంధ సంఘటనల యొక్క భవిష్యత్‌ ప్రమాదాన్ని 44 శాతం పెంచుతుందని, అన్ని కారణాలచే మరణించే ప్రమాదాన్ని 47 శాతం  పెంచుతుందని, ఆర్థిక సహాయం లేకపోవడంతోపాటు హృదయ సంబంధ సంఘటనల ప్రమాదాన్ని 30 శాతం పెంచుతుందని తేలింది. 
 
కొవిడ్‌-19 మహమ్మారితో పోరాడేందుకు మనం సామాజిక సంబంధానుల నివారించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. మన జీవితంలో సామాజిక సంబంధాల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని మనం గుర్తించాలి. మన సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడాన్ని మనం తరుచుగా  విస్మరిస్తున్నప్పటికీ.. ఈ మహమ్మారి కారణంగా దాని ప్రాముఖ్యాన్ని గ్రహించే అవకాశం లభించింది.

ఇది సానుకూల భావోద్వేగాలను మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా కొనసాగించడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments