Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాను షేక్ చేసిన 'బచ్‌పన్ కా ప్యార్' బాలుడికి ప్రమాదం

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (11:03 IST)
ఒకపుడు సోషల్ మీడియాను షేక్ చేసిన 'బచ్‌పన్‌ కా ప్యార్' అనే పాటతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన సహదేవ్ అనే బాలుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయన నడుపుతున్న మోటార్ బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సహదేవ్ మోటార్ బైకుపై ప్రయాణిస్తుండగా వాహనం అదుపు తప్పి కిందపడింది. దీంతో సహదేవ్‌తో పాటు ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. తొలుత సుక్మా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం జగ్‌దల్‌పూర్ వైద్య కాలేజీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, గత 2019లో బచ్‌పన్ కా ప్యార్ అనే పాటను సహదేవ్ పాడగా ఆ పాటను స్కూల్ టీచర్ ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ పాట వైరల్ అయింది. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. దీంతో సహదేవ్ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపుపొందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments