Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీపై అభియోగాలు నమోదు చేస్తే.. రాష్ట్రపతి రేస్ నుంచి తప్పుకుంటారా?

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ మసీదు కూల్చివేత కేసులో అద్వానీతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలను కుట్రదారులుగా చేర్చాలా? వద్దా అన్

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (17:32 IST)
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ మసీదు కూల్చివేత కేసులో అద్వానీతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలను కుట్రదారులుగా చేర్చాలా? వద్దా అన్న అంశంపై సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలివ్వనుంది. 
 
నిజానికి అత్యున్నత న్యాయస్థానం బుధవారమే తీర్పు చెప్పాల్సి ఉండగా గురువారానికి వాయిదా వేసింది. గతంలో అద్వానీతో సహ 13 మందిపై కింది కోర్టు అభియోగాలను కొట్టివేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. సాంకేతిక కారణాలు చూపుతూ అభియోగాలను కొట్టివేయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కనుక గురువారం అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కతియార్, కళ్యాణ్ సింగ్‌లను నిందితులుగా పేర్కొన్నపక్షంలో వారిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. 
 
ఇదే జరిగితే భారత రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి రేస్‌లో ఉన్న ఎల్కే.అద్వానీ పరిస్థితి ఏమిటన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అభియోగాలు నమోదు చేసినప్పటికీ.. ఆయన రాష్ట్రపతి అభ్యర్థి రేస్‌లో ఉంటారా? లేక తప్పుకుంటారా? అన్నది తేలాల్సివుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments