Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ చనిపోయినా వదలని కర్ణాటక సర్కార్.. రూ.100కోట్లు రావాల్సిందేనని?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న అమ్మ నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్‌ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈమెతో పాటు జయలలిత అక్రమాస్తుల కేసులో ఇళవరశి, వి.ఎన్‌.సుధాకరన్‌‌

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (17:11 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న అమ్మ నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్‌ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈమెతో పాటు జయలలిత అక్రమాస్తుల కేసులో ఇళవరశి, వి.ఎన్‌.సుధాకరన్‌‌లను కూడా దోషులుగా సుప్రీం కోర్టు తేల్చింది. ఇక జయలలిత మరణించడంతో ఈ కేసు నుంచి ఆమెకు విముక్తి లభించింది. జయలలిత 2016 డిసెంబర్‌ 5వ తేదీన మరణించారు. 
 
అయితే జయలలిత మరణించినా ఈ కేసు విషయంలో కర్ణాటక వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. జయలలిత అక్రమాస్తుల కేసులో జరిమానా నుంచి తమకు రావాల్సిన రూ. 100 కోట్ల కోసం సుప్రీంకోర్టును కర్ణాటక సర్కారు ఆశ్రయించింది. జయ మరణించడం వల్ల ఆమె శిక్ష అనుభవించే పరిస్థితి లేనప్పటికీ, ఆమెకు విధించిన జరిమానాను మాత్రం తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. 
 
కాగా ఈ కేసుకు సంబంధించి విధించిన మొత్తం జరిమానాలో జయలలిత వాటా రూ. 100 కోట్లు. ఈ మొత్తం కర్ణాటక ప్రభుత్వానికి రావాల్సింది. కానీ జయ మరణించడంతో ఆమెపై విధించిన జరిమానాను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో జయలలిత ఎస్టేట్ నుంచి రూ.100 కోట్ల జరిమానాను కట్టాలని కర్ణాటక సీనియర్ న్యాయవాది డిమాండ్ చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments