Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలపై బలమైన వస్తువుతో 20సార్లు మోది బీఈడీ విద్యార్థిని దారుణ హత్య

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (10:03 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ బీఈడీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆమె చదువుతున్న కళాశాల ముందే.. ఆ మహిళ చేతులు నరికి.. తలపై బలమైన వస్తువుతో 20 సార్లు మోది చంపేశారు. ఈ సంచలన హత్య జార్ఖండ్‌లోని రాంగఢ్‌లో జరిగింది. 
 
సొనాలీ మర్ము (30) అనే వివాహిత రాంగఢ్‌లోని ఓ కాలేజీలో బీఈడీ చదువుతుంది. అదే కాలేజీలో చదువుతున్న సొనాలీ చిన్ననాటి స్నేహితుడు సుకేన్ మండల్ (35) కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నానని వేధించసాగాడు. అయితే, ఆ ప్రేమను తిరస్కరించిన సొనాలీ.. పెళ్లి చేసుకుంది. ఈ వివాహం తర్వాత కూడా సుకేన్ బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ విషయం భర్త చిత్తరంజన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఫోన్ నంబర్ మార్పించాడు. అదేసమయంలో సుకేన్ వేధింపుల విషయాన్ని బయటకు చెబితే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పలేదు. ఇంతలో బుధవారం ఈ దారుణం జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇప్పటికే ఈకేసులో అనుమానితుడిని గుర్తించినట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments