Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యపై యావద్భారతం సాధించిన విజయం : వెంకయ్య నాయుడు

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (16:42 IST)
ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై శనివారం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. 'అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునివ్వడం శుభపరిణామం. చాలా ఏళ్లుగా కొనసాగుతున్నసమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. యావద్భారతం సాధించిన ఘన విజయమిది' అని వ్యాఖ్యానించారు. 
 
ఈ కేసు విషయంలో గతాన్ని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ.. శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలి. మన సర్వమానవ సౌభ్రాతత్వ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ.. మన సంస్కృతి, ఘనమైన వారసత్వాన్ని కాపాడుకునేందుకు లక్ష్యంతో పనిచేయాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగా, అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments