Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోండి : ముఖ్యమంత్రులకు అమిత్ షా ఫోన్

Advertiesment
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోండి : ముఖ్యమంత్రులకు అమిత్ షా ఫోన్
, శనివారం, 9 నవంబరు 2019 (14:21 IST)
వివాదాస్పద అయోధ్య సమస్యపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు తీసుకునేందుకుగానూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఆ తర్వాత ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. రాష్ట్రాల్లో తీసుకుంటోన్న చర్యల గురించి ముఖ్యమంత్రులను అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే శాంతి, భద్రతలను కొనసాగిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
మరోవైపు, అయోధ్య తీర్పు వెలువడక ముందే ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌, ఇతర ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. తుది తీర్పు వెల్లడైన నేపథ్యంలో ప్రజలంతా శాంతి, సంయమనంతో ఉండాలని కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామమందిర నిర్మాణానికి ముస్లింలు సహకరించాలి : రాందేవ్