Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య వేడుకలకు ఎల్కే.అద్వానీ దూరం.. ఎందుకో తెలుసా?

వరుణ్
సోమవారం, 22 జనవరి 2024 (12:20 IST)
అయోధ్య రామ మందిర నిర్మాణానికి పునాది వేసిన భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ సోమవారం ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, బీజేపీ శ్రేణులు మాత్రం అనారోగ్య కారణాల వల్లే ఆయన ఈ మహా కార్యానికి దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరో బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి కూడా హాజరుకావడం లేదు. ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్వానీ తన అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. 
 
రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు రావాలంటూ అద్వానీ, జోషిని విశ్వహిందూ పరిషత్ గత యేడాది డిసెంబరు నెలలోనే ఆహ్వానించింది. కానీ, ఆయన అనారోగ్యం కారణంగా హాజరుకాలేక పోయారు. మరోవైపు, ఈ నెలాఖరులోగా బాల రాముడిని అద్వానీ దర్శించుకుంటారని విశ్వహిందూ పరిషత్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. దాదావు 60 దేశాల్లో వీహెచ్‌పీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments