Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోమాంచిత అద్వానీ రథ యాత్ర.. నేడు రామ మందిరం సాకారం!!

advani rath yatra

వరుణ్

, సోమవారం, 22 జనవరి 2024 (09:29 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అలియాస్ ఎల్కే అద్వానీ. రామ జన్మభూమి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది అద్వానీ పేరు. అంతకుముందు ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది సాధుసంతులు అయోధ్యలో రామాలయం కోసం పోరాడారు. కానీ, ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ అంశాన్ని రాజకీయ, సామాజిక ఉద్యమంగా మలిచి ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా చేసింది మాత్రం అద్వానీయే. 
 
1990లో ఒక టొయోటా మినీ ట్రక్కును రథంగా మార్చి గుజరాత్‌ రాష్ట్రంలోని సోమ్‌నాథ్‌ ఆలయం నుంచి అయోధ్యలో రామజన్మభూమి దాకా ఆయన ప్రారంభించిన యాత్రకు విస్తృత మద్దతు లభించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన భారతీయ జనతా పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి రామమందిరాన్ని నిర్మించడానికి అవసరమైన భూమికను ఏర్పరచింది అద్వానీ రథయాత్రేననడంలో సందేహం లేదు.
 
బాబ్రీ కూల్చివేత జరిగిన సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న నేత కళ్యాణ్ సింగ్. 1991 జూన్‌లో ఆయన సీఎంగా ప్రమాణం చేయడానికి ముందే రామ్‌లల్లా విగ్రహం వద్దకు వెళ్లి తన పాలనలోనే అక్కడ రామమందిర నిర్మాణం జరిపించి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు. 1992లో మసీదు కూల్చివేస్తున్న కరసేవకులపై ఫైరింగ్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి నిరాకరించారు. రామమందిర నిర్మాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టం అదే.
 
అయోధ్య ఉద్యమంలో భాగంగా అద్వానీ తొలుత సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్య దాకా పాదయాత్ర చేపట్టాలని భావించారు. అయితే, రాముడి రథం లాంటిదాంట్లో యాత్ర చేపడితే బాగుంటుందని, ప్రజల్లోకి బాగా వెళ్తుందని అప్పటి బీజేపీ జనరల్‌ సెక్రటరీ ప్రమోద్‌ మహాజన్‌ సూచించారు. ఆయన ఇచ్చిన రథయాత్ర ఐడియా అద్భుతంగా వర్కవుట్‌ అయ్యింది. రథయాత్ర సక్సెస్‌ అయింది.
 
విశ్వహిందూ పరిషత్‌ 1984లో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వందలాది సాధువులు, హిందూ ప్రముఖులతో ‘ధర్మ సదస్సు’ నిర్వహించింది. రామజన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అక్కడే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ ఉద్యమానికి అశోక్‌ సింఘాల్‌ ప్రధాన రూపకర్తగా మారి ముందుకు నడిపించారు. 1980లో రామజన్మభూమి తాళాలు తెరవాలని కోరుతూ.. రామ్‌జానకీ రథయాత్రను నిర్వహించారు. ఆయన కృషి వల్లనే కరసేవ ఉద్యమం కూడా మొదలైంది. బాబ్రీమసీదు తాళాలు తెరుచుకున్న తర్వాత.. అక్కడ ఆలయం కట్టాలనే ఉద్యమానికి తెరతీశారు. ఆపై దాన్ని అద్వానీ అందిపుచ్చుకున్నారు.
 
అద్వానీ  చేపట్టిన రథయాత్రలో 'సెకండ్‌ ఇన్‌ కమాండ్‌'గా వ్యవహరించిన కీలక వ్యక్తి మురళీ మనోహర్‌జోషీ. 1992లో మథురలో.. బాబ్రీమసీదు కూల్చివేతకు కారణమయ్యేలా కరసేవకులను రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
 
రెచ్చగొట్టే నినాదాలతో ప్రసంగాలు చేయడంలో దిట్ట. బాబ్రీమసీదు కూల్చివేత సమయంలో ఆమె ఇలాగే తన నినాదాలతో కరసేవకులను రెచ్చగొట్టినట్టు లిబర్హాన్‌ కమిషన్‌ తేల్చింది. ప్రణాళిక ప్రకారం ఆమె ఇచ్చిన సంకేతంతోనే మసీదు కూల్చివేత మొదలైందని ఆమెపై దాఖలైన అభియోగపత్రంలో పేర్కొన్నారు. 
 
రామ మందిర నిర్మాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఏర్పాటైన సంస్థ బజ్‌రంగ్‌ దళ్‌కు తొలి అధ్యక్షుడు వినయ్‌ కతియార్‌. ఫైర్‌బ్రాండ్‌. కాగా, బాబ్రీ తాళాలు తెరిపించి శిలాన్యాస్‌కు అనుమతించిన రాజీవ్‌ గాంధీ, మసీదు కూల్చివేత వేళ మౌనముద్ర దాల్చిన నాటి ప్రధాని పీవీ కూడా మందిర నిర్మాణంలో పరోక్షంగా కీలకపాత్ర పోషించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటనకు షెడ్యూల్ ఖరారు