అయోధ్య రామాలయంలోనే యువతిపై సామూహిక అత్యాచారం..

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:11 IST)
అయోధ్య రామాలయంలో ఘోరం జరిగింది. అయోధ్య లోని రామజన్మ భూమి గుడి కాంప్లెక్స్‌లో పనిచేసే ఒక యువతి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా ఒక్కసారి కాకుండా మూడు సార్లు యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది. 
 
అయోధ్య జిల్లాలోని సహదత్‌గంజ్‌కు చెందిన వంశ్‌ చౌదరి తనను పర్యాటక ప్రదేశాలను చూపిస్తానంటూ..తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆగస్టు 16న తనను గెస్ట్‌ హౌస్‌కి తీసుకెళ్లి అక్కడే నిర్బంధించాడు. 
 
అతను, తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తనపై సామూహిక లైంగికదాడి చేశాడని.. ఆపై తన స్నేహితులైన వినరు కుమార్‌, మహ్మద్‌ షరీక్‌లను పిలిపించి మరీ అఘాయిత్యం చేశారని వివరించింది. 
 
ఇలా మరో మూడుసార్లు జరిగిందని.. బయట చెప్తే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై రాజకీయ పార్టీల ఆందోళన చేపట్టారు. మహిళా సంఘాలు సైతం మండిపడుతున్నాయి. 
 
కాగా బాధితురాలు అయోధ్య పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం బీఏ విద్యార్థినిగా చదువుతూ.. ఆమె రామజన్మభూమి ఆలయంలో క్లీనింగ్‌ సిబ్బందిగా కూడా పనిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments