Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.15 నుంచి రూ.20వరకు పెరిగిన కిలో వంటనూనె ధర

Oils

సెల్వి

, బుధవారం, 18 సెప్టెంబరు 2024 (09:10 IST)
కేంద్ర ప్రభుత్వం పండుగల వేళ ప్రజలకు భారీ షాక్‌ ఇచ్చింది. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు లీటర్‌పై ఒకసారిగా రూ.15-20 వరకు పెరిగాయి. కిలో వంటనూనె ధర రూ.15 నుంచి రూ.20వరకు పెరిగింది. 
 
పామాయిల్‌ ధర రూ.100 నుంచి రూ.115-120, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165-170కు చేరింది. 
 
దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఓ వైపు కూరగాయల ధరలు మండిపోతుండటం.. మరోవైపు వంటనూనెల ధరలు భగ్గుమంటుండటంతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)