Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిస్క్ లేదు.. నెలకు రూ.1500 పెట్టుబడి పెడితే రూ.5 లక్షలు

Advertiesment
money

సెల్వి

, మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (18:42 IST)
రిస్క్ లేదు.. నెలకు రూ. 1500 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ ముగిసే సమయానికి రూ. 5 లక్షలు మీ సొంతం. రిస్క్ లేకుండా భద్రతతో కూడుకున్న రిటర్న్స్ కావాలంటే.. ప్రభుత్వ పథకాలే మేలు. అందులో ఒకటే ఈ పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ పథకం. 
 
పోస్టాఫీస్ పథకాల్లో అధిక వడ్డీని ఇచ్చే పథకాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో పెట్టుబడి పెడితే.. ఇన్వెస్ట్మెంట్‌పై 7.1 శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకంలో 15సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా 5 సంవత్సరాల చొప్పున మెచ్యూరిటీ డేట్ పెంచుకుంటూ పోవచ్చు. 
 
ఈ పీపీఎఫ్ స్కీంలో ప్రతీ ఏడాది కనీసం రూ. 500 నుంచి గరిష్టం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో 5 లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.18,000 అవుతుంది. 
 
ఇలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మొత్తం రూ. 2,70,000 జమ అవుతుంది. ప్రస్తుతమున్న 7.1 శాతం వడ్డీ రేటుతో చూస్తే.. మీకు ఆదాయంపై 2,18,185 వడ్డీ లభిస్తుంది. వడ్డీని కలుపుకుంటే.. మొత్తం రూ. 4,88,185 మీ సొంతమవుతుంది. అంటే దాదాపుగా రూ. 5 లక్షలు చేతికి అందుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైక్రో సబ్‌స్టేషన్ నుండి పవర్ వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ తో విద్యుత్ సరఫరా చేయడానికి ఒక ప్రదర్శన ప్రాజెక్ట్‌