Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపిస్టులను పట్టించిన వీర్యకణాలు ... ఆత్మహత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు..

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (13:53 IST)
ఓ యువతి ఆత్మహత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి. ఈ కేసులోని నిందితులను వీర్యకణాలు పట్టించాయి. దీంతో పోలీసులు నోరెళ్ళబెట్టారు. 19 ఏళ్ల‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌న్న కేసులో విచార‌ణ జ‌రుపుతున్న పోలీసుల‌కు దిమ్మ‌తిరిగే విష‌యాలు వెలుగుచూశాయి.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజ‌రాత్‌లోని వ‌డోద‌రలో 19 ఏళ్ల‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌ చేసుకుంది. దీంతో పోలీసులు ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసుల‌కు దిమ్మ‌తిరిగే విష‌యాలు వెలుగుచూశాయి. 
 
మహిళ గర్భాశయం ప్రాంతంలో స్పెర్మ్ కణాలు ఉన్నట్లు శవపరీక్ష నివేదికలో తేలింది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. నిందితులు, ఫుడ్‌డెలివరీ కంపెనీలో వారి సహోద్యోగి అయిన బాధితురాలిని జూన్ 8వ తేదీన ఒక ప్రైవేట్ పార్టీలో మద్యం సేవించమని బలవంతం చేశార‌ని, ఆపై వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశార‌ు.
 
తనకు జరిగిన ఘటనను తలుచుకుని ఆ యువతి అవమానభారంతో కుంగిపోయింది. ఈ క్రమంలో జూన్ 10 ఉదయం తన ఇంట్లో యువ‌తి ఉరి వేసుకుంది. దీనిపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
'ఆత్య‌హ‌త్య కేసు నమోదు చేయడానికి కుటుంబ స‌భ్యులు మమ్మల్ని సంప్రదించినప్పుడు, తండ్రితో విభేదాల కారణంగా ఆమె వేరుగా నివసిస్తున్న‌ట్లు తెలిసింది. దీంతో మాకు అనుమానం క‌లిగింది. ఆమెకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలియదని కుటుంబం తెలిపింది. 
 
శవపరీక్ష సమయంలో నిర్దిష్ట ఫోరెన్సిక్ పరీక్ష చేయాల‌ని నిపుణుల‌ను అడిగాం. పోస్టుమార్టం చేసిన టీమ్ ఆమె గర్భాశయ ప్ర‌దేశంలో స్పెర్మ్ కణాల ఉనికిని గుర్తించింది. ఆ తర్వాత, మేము లైంగిక వేధింపుల కోణం నుండి కేసును విచారించగా, నిందితుల గురించి తెలిసింది” అని కేసును విచారిస్తున్న‌ పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం