Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో టూ చైల్డ్ పాలసీ : మండిపడుతున్న ముస్లింలు

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (16:19 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టూ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. దీనిపై ముస్లిం సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అస్సాంలో జనాభా అదుపునకు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం టు చైల్డ్ పాలసీని అమలు చేయడానికి శ్రీకారం చుడుతుందని ఆయన ప్రకటించారు. 
 
రుణ మాఫీ వంటి సౌకర్యాలు ఇక టీ గార్డెన్స్ వర్కర్స్‌కి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వర్తించబోవని, వారికి బదులు ఈ పాలసీని పాటించేవారికి అమలు చేయనుంది. ప్రభుత్వ పథకాల ఫలాలు ఒకరు లేదా మరో బిడ్డ ఉన్నవారికి మాత్రమే దక్కుతాయని ప్రకటించింది. 
 
పాపులేషన్ పాలసీ అన్నది అప్పుడే అమలు కావడం ప్రారంభించిందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. గత నెలలో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఆయన జనాభా అదుపుపై దృష్టిసారించిన విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా ముస్లిములు ఇద్దరు బిడ్డల విధానాన్ని పాటిస్తే మేలని చెబుతూ వచ్చారు. మీరు డీసెంట్ ఫ్యామిలీ పద్దతిని అనుసరించాలని మూడు జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఉద్బోధించారు. 
 
ఈ జిల్లాల్లో ముస్లిముల జనాభా ఎక్కువగా ఉన్న దృష్ట్యా శర్మ వీటిని విజిట్ చేశారు. జనాభా అదుపు వల్ల పేదరికం తగ్గుతుందని, పరిమిత కుటుంబం ఉన్నందువల్ల తమ సంతానాన్ని తల్లిదండ్రులు చక్కగా చదివించుకోగలుగుతారని…వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చగలరని ఆయన చెప్పారు.
 
ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉన్న కుటుంబాలను హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. ఇకనైనా మీరు పరిమిత కుటుంబాన్ని ఏర్పరచుకోవాలన్నారు. కాగా సీఎం ప్రకటనలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments