Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో డిప్యూటీ సీఎం... మొబైల్ నుంచి పోర్న్ క్లిప్పింగ్స్ షేరింగ్!!

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:16 IST)
ఆయనో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అదీకూడా దేశంలోనే ప్రముఖ పర్యాటక గుర్తింపు పొందిన రాష్ట్రమైన గోవాకి. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చంద్రకాంత్ కవేల్కర్ ఉన్నారు. ఈయన ఫోను నుంచి పోర్న్ క్లిప్పింగ్స్ షేర్ అయ్యాయి. ఈ విషయం బటకు లీక్ కావడంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. 
 
ఆయన ముబైల్‌ ఫోన్‌ నుంచి ఒక వాట్సప్‌ గ్రూప్‌కు పోర్న్ క్లిప్‌ ఫార్వర్డ్‌ అయింది. ఓ ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ఫోన్ నుంచి తమకు అందిన ఆ పోర్న్ వీడియోలను చూడగానే వాట్సాప్‌ గ్రూపు సభ్యులు షాకయ్యారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని విజ్ఙప్తి చేశారు. 
 
కాగా, ఈ  ఘటనపై డిప్యూటీ సీఎం కవెల్కర్‌ స్పందించారు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని, వారిని పట్టుకోవాలని శిక్షించాలని కోరారు. ఈ మేరకు సైబర్‌ సెల్‌ విభాగానికి ఫిర్యాదు చేశారు. 'నేను చాలా వాట్సాప్ గ్రూపులలో మెంబర్‌గా ఉన్నాను. ఫోన్ హ్యాక్ చేసిన వాళ్లు కావాలనే 'విలేజెస్ ఆఫ్ గోవా' గ్రూపులో ఆ క్లిప్‌ను ఫార్వర్డ్ చేశారు. మిగతా ఏ గ్రూప్‌కు ఈ క్లిప్ పంపలేదు. 
 
ఆ క్లిప్ గ్రూప్‌లో ఆదివారం రాత్రి 1:20 గంటలకు ఫార్వర్డ్ అయింది. ఆ సమయంలో నిద్రపోతున్నాను. గతంలో కూడా నా పేరును, నా పరువును కించపరచడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. నేరపూరితంగా కావాలనే నా ఫోన్ హ్యాక్ చేసిన దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎదుర్కోలేక ఈ పని చేశారు' అని కవేల్కర్ చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం