Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడుగా అశోక్ గెహ్లాట్?

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (16:01 IST)
కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడుగా అశోక్ గెహ్లాట్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడుని ఎన్నుకునే పనిలో నిమగ్నమయ్యాడు. 
 
ఈ క్రమంలో కాంగ్రెస్‌ జాతీయాధ్యక్ష పదవి రేసులోకి తాజాగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ వచ్చారు. రాజీనామా విషయంలో రాహుల్‌ గాంధీ పట్టు వీడకపోవడంతో అశోక్‌కు తదుపరి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. 
 
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ రాజీనామా ప్రతిపాదన తెచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తన పట్టు వీడటం లేదు. దీంతో తెరపైకి అశోక్‌ గెహ్లాట్ పేరు వచ్చింది. పార్టీతో సుదీర్ఘ అనుబంధం, రాజకీయాల్లో అపార అనుభవం దృష్ట్యా అశోక్‌ను రంగంలోకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్‌ జాతీయాధ్యక్ష పదవిలోనూ గెహ్లాట్ కొనసాగనున్నారని సమాచారం. పార్టీ సీనియర్లు, రాహుల్ కుటుంబ సభ్యులు సైతం అశోక్‌వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అస్లాం షేర్‌ ఖాన్‌ కూడా అధ్యక్ష పదవి కోసం ఎదురు చూసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments