సాధారణంగా వివాహానికి వచ్చిన అతిథులు, బంధుమిత్రులు తమకుతోచిన విధంగా కట్నకానుకలు ఇచ్చి వెళ్లడం ఆనవాయితీ. కానీ, ఆ యువకులు మాత్రం కొత్తగా పెళ్లయిన జంటకు ఐదు లీటర్ల పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చారు.
సాధారణంగా వివాహానికి వచ్చిన అతిథులు, బంధుమిత్రులు తమకుతోచిన విధంగా కట్నకానుకలు ఇచ్చి వెళ్లడం ఆనవాయితీ. కానీ, ఆ యువకులు మాత్రం కొత్తగా పెళ్లయిన జంటకు ఐదు లీటర్ల పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా కొందరు మిత్రులు నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్‌ను పెళ్లి కానుకగా ఇచ్చి తమ నిరసనను వ్యక్తంచేశారు.
ఇక పెట్రోల్‌ను గిఫ్ట్ ఇవ్వడంతో వివాహానికి వచ్చిన వారితోపాటు వధూవరులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు. తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ.85.15లుగా ఉంది. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే.