Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తోందా? పరిస్థితి ఎలా వుంటుంది?

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (17:21 IST)
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈనెల 15తో ముగుస్తోందా? అనే దానిపై చర్చ సాగుతోంది.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ చేసిన ట్వీట్‌ ఈ అనుమానాలకు తావిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అత్యవసర వైద్య పరికరాలు, మందులు, మందుల తయారీకి అవసరమైన సామగ్రిని తగిన స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు మోదీ ఈ సందర్భంగా సూచించారు. రాబోయే కొన్ని వారాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటీన్‌ల పైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 
 
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోంది. కానీ, దానర్థం వీధుల్లో స్వేచ్ఛగా తిరగొచ్చని కాదని.. వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సామాజిక దూరం పాటించడం, లాక్‌డౌన్ మాత్రమే కోవిడ్-19ను ఎదుర్కొనే మార్గమని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కానీ ఈ ట్వీట్‌ను ఆయన కొద్ది సమయంలో డిలీట్ చేశారు. అయితే ప్రభుత్వం తరపు నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయడంపై గానీ, ప్రజా రవాణాకు అనుమతి విషయంలో కానీ ఎలాంటి సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments