Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కట్నంగా కొబ్బరి బోండం.. దేశానికి ఆదర్శనంగా నిలిచిన జవాను!

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (09:31 IST)
ఈ కాలంలో పెళ్ళిల్లు చేయాలంటే తలకుమించిన భారంగా మారింది. ముఖ్యంగా, ఆడపిల్ల చేయాలంటే ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం తన పెళ్లికి కట్నంగా కేవలం ఒక్క రూపాయి, ఒక్క కొబ్బరి బోండాంను మాత్రమే కట్నంగా తీసుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాడు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని లక్నోకు సమీపంలో ఉన్న గంగోహ్ పరిధిలోని జుఖెడి గ్రామనివాసి సంజయ్ కుమార్ కుమారుడు వివేక్ కుమార్‌కు బీన్డాకు చెందిన అరవింద్ కుమార్ కుమార్తె ప్రియతో నవంబరు 30వ తేదీన వివాహం జరిగింది. 
 
ఈ సందర్భంగా వధువు తల్లిదండ్రులు కట్నకానుకల రూపంలో లక్షల రూపాయలు ఇవ్వాలనుకున్నారు. అయితే వరుడు వివేక్ తనకు ఎటువంటి కట్నకానుకలు వద్దని కేవలం ఒక్క రూపాయి, కొబ్బరిబోండంచాలని, వాటినే స్వీకరించారు. వధువే తనకు అందమైన కట్నమని తెలిపారు. 
 
వధువు ప్రియ కూడా తనకు కాబోయే భర్త ఆదర్శభావాలకు మురిసిపోయింది. కాగా వివేక్, ప్రియలకు యేడాది క్రితమే నిశ్చితార్థం జరిగినా, వివేక్ ఉద్యోగ బాధ్యతల కారణంగా పెళ్లి వాయిదా పడింది. వివేక్‌ను ఇటీవలే లక్నోకు బదిలీ చేశారు. దీంతో వీరి పెళ్లికి ఆటంకాలు తొలగిపోయినట్లయ్యింది. 
 
కాగా, దేశంలో వరకట్నవ్యవస్థను రూపుమాపాలనే సందేశమిస్తూ సైనికుడు వివేక్ చేసుకున్న వివాహం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ జవానును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments