శివ్‌‌గఢ్‌లో కూలిన హెలికాఫ్టర్ - ఆర్మీ జవాన్లకు గాయాలు

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (15:34 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లా శివ్‌‌గఢ్‌లో మంగళవారం ఉదయం ఓ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలింది. వాతావరణం అనుకూలించపోవడంతో ఈ హెలికాఫ్టర్ నియంత్రణ కోల్పోయింది. దీంతో కుప్పకూలిపోవడంతో తునాతునకలైపోయింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ... తీవ్రంగా గాయపడ్డారు. పొగ మంచు కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు. 
 
కాగా, హెలికాఫ్టర్ కూలిపోయిన విషయాన్ని స్థానికులు పోలీసులు, ఆర్మీ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో వెంటనే రెస్క్యూ టీమ్‌తో పోలీసులు ఆ స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
హెలికాప్టర్‌‌లో ఉన్న ఇద్దరు ఆర్మీ జవాన్లకు గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించామని ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌధరీ తెలిపారు. పొగ మంచు కారణంగా హెలికాప్టర్‌‌ కూలినట్లు ఆయన అన్నారు. అయితే హెలికాప్టర్‌‌ కూలిపోయిందా? లేక క్రాష్ ల్యాండింగ్ జరిగిందా? అన్నది తెలియాల్సి ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments