Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియత్నాంలో బయల్పడిన ఇసుక రాతితో చేసిన ఏకశిలా శివలింగం

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (10:14 IST)
Shiva linga
వియత్నాంలో పురాతన శివలింగం బయటపడింది. ఈ శివలింగం 9వ శతాబ్ధానికి చెందిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియాలో వెల్లడించారు. చామ్‌ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుపుతున్న పునరుద్ధరణ పనుల్లో ఈ శివ లింగం బయల్పడింది. ఈ విషయాన్ని. దీంతో ఇరు దేశాల మధ్య 'నాగరికత సంబంధం' విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేయొచ్చని చెప్పారు. 
 
9వ శతాబ్ధానికి చెందిన ఇసుక రాతితో చేసిన ఈ ఏకశిలా శివలింగం అరుదైనదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్‌కి అభినందనలు తెలియజేశారు. 2011లో తాను వియత్నాంలో పర్యటించానని.. ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని జైశంకర్ ట్వీట్ చేశారు.
 
కాగా వియత్నంలోని క్వాంగ్‌ నామ్‌ పరిధిలో ఉన్న మై సన్‌ సిటీలో చామ్ టెంపుల్ ఉంది. దీన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. ఇంద్రవర్మన్ 2 పరిపాలన కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
 
ఆయన బౌద్ధమతాన్ని బాగా ప్రచారం చేయగా.. బౌద్ధంతో పాటు హిందూ మతం కూడా అప్పట్లో వియత్నాంలో ఉన్నట్లు ఈ శివలింగం ద్వారా తెలుస్తోంది. ఇక ఈ దేవస్థానంలో ఇంతకుముందు కూడా ఆరు శివ లింగాలను గుర్తించారు. అయితే వాటన్నింటికంటే ఇది చాలా అద్భుతమైందని జై శంకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments