Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచింగ్‌ హబ్‌ కోటాలో 25కి చేరిన ఆత్మహత్యలు.. తాజాగా విద్యార్థిని విషం తాగి..?

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (14:15 IST)
రాజస్థాన్‌లోని ప్రముఖ కోచింగ్‌ హబ్‌ కోటాలో విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. తాజాగా కోటాలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఏడాది అక్కడ సూసైడ్‌ చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 25కి చేరింది. 
 
వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్ధిని విషం సేవించి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మహువా జిల్లాకు చెందిన మృతురాలు ప్రియమ్‌ సింగ్‌ (17) ఒకటిన్నర ఏడాదిగా కోటాలో నీట్‌ యూజీకి కోచింగ్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటోన్న ప్రియమ్‌ సమీపంలోని కోచింగ్‌ సెంటర్‌లో ఏడాదిన్నర నుంచి నీట్‌కు శిక్షణ తీసుకొంటోంది. సోమవారం కోచింగ్‌ సెంటర్‌లోనే వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురైంది. 
 
తోటి విద్యార్థులు కోచింగ్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆమెను తల్వాండిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రియమ్‌ చికిత్స పొందుతూ సాయంత్రం 6.45 గంటలకు మరణించినట్లు విజ్ఞాన్‌ నగర్‌ పోలీస్‌ ఇన్‌ఛార్జ్‌ కౌశల్య తెలిపారు.
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్ధి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా విద్యార్థిని విషం సేవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments