Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ జాబితాలో మరో రాష్ట్రం.... గోవాలో మే 3 వరకు..

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (15:14 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కట్టడి కోసం అటు కేంద్రంతో పాటు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా పలు రాష్ట్రాలు లాక్డౌన్‌ను విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక వంటి రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇపుడు మరో రాష్ట్రం లాక్డౌన్ రాష్ట్రాల జాబితాలో చేరింది. ఆ రాష్ట్రం గోవా. 
 
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో గోవా కూడా లాక్డౌన్ విధించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం మధ్యాహ్నం లాక్డౌన్‌పై ప్రకటన చేశారు. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వస్తుందని, మే 3 దాకా ఐదు రోజులపాటు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. లాక్డౌన్ కాలంలో కేవలం అత్యవసర, నిత్యవసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
 
ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. కాసినోలు, హోటళ్లు, పబ్‌లనూ పూర్తిగా మూసేస్తున్నట్టు వెల్లడించారు. నిత్యవసరాల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులను తెరిచే ఉంచుతామన్నారు. ప్రస్తుతం గోవాలో రోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 31 మంది చనిపోగా, 2,110 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో మొత్తంగా ఆ రాష్ట్రంలో 81,908 మంది కరోనా బారిన పడగా.. 1,086 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments