Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్​

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:23 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులు.. ఉరి నుంచి తప్పించుకోవడానికి తమకున్న చివరి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దోషుల్లో ఒకరైన వినయ్​కుమార్​ శర్మ.. ఇప్పటికే సుప్రీం కోర్టులో క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేయగా.. తాజాగా మరో నిందితుడు ముకేశ్​ కుమార్​ కూడా మరణ శిక్షను సవాల్​ చేస్తూ అదే వ్యాజ్యం దాఖలు చేశాడు.

నిర్భయ సామూహిక హత్యాచారం కేసు దోషి ముకేశ్​ కుమార్‌.. సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరి శిక్షపై స్టే విధించాలని వ్యాజ్యం నమోదు చేశాడు. న్యాయపరంగా చివరి అవకాశాన్ని వినియోగించుకున్నాడు ముకేశ్​ కుమార్‌.

దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరు ముకేశ్​ కుమార్​. న్యాయస్థానం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీర్పు ఇచ్చిందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. సామాజిక-ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల ఆనారోగ్యం, జైల్లో సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశాడు.

నిర్భయ కేసులో మరో నిందితుడైన వినయ్‌కుమార్‌శర్మ మరణ శిక్షను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments