Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారసుడు కావాలనుకున్నాడు.. ఆడపిల్ల పుట్టిందని బావిలో తోసేశాడు..

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (14:23 IST)
వారసుడు కావాలనుకున్నాడు. కానీ అతని భార్య మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భార్యా పిల్లలపై కోపం పెంచుకున్నాడు. సమయం చూసుకుని వారిని బావిలో తోసేశాడు. అయితే భార్య, చిన్నారి బతికి బయటపడగా, పెద్దకూతురు మరణించింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతార్పూర్‌లో జరిగింది.
 
ఛతార్పూర్‌కు చెందిన రాజా బైయా యాదవ్‌ భార్య మూడు నెలల క్రితం ఓ ఆడపిల్లకి జన్మనిచ్చింది. వారికి అప్పటికే ఎనిమిదేళ్ల అమ్మాయి ఉంది. అయితే అతడు రెండో సంతానంగా కొడుకు పుడతాడని అనుకున్నాడు. అమ్మాయి కావడంతో నిరాశకు గురయ్యాడు.
 
కాగా, డెలివరీ అయినప్పటి నుంచి అతని భార్య తన పుట్టింట్లో ఉంటుంది. చిన్నారికి మూడు నెలలు నిండటంతో వారిని తన ఇంటికి తీసుకుపోవాలనుకున్నాడు. ఈ క్రమంలో శనివారం పన్నా జిల్లాలో ఉన్న తన అత్తగారింటికి వెళ్లాడు. ఆదివారం భార్యా పిల్లలను తీసుకుని ఛతార్పూర్‌ బయల్దేరాడు.
 
అయితే మార్గమధ్యంలో ఓ బావి వద్ద తన బైక్‌ను ఆపి భార్యా పిల్లలను అందులోకి తోసేశాడని పోలీసులు తెలిపారు. దీంతో ఎనిమిదేండ్ల అమ్మాయి చనిపోయిందని వెల్లడించారు. బావిలోనుంచి పైకి రావడానికి ప్రయత్నించిన భార్యపై రాళ్లు కూడా వేశాడని చెప్పారు. 
 
అయితే స్థానికులు ఆమె కేకలు విని ఆమెను రక్షించారని, రాజా యాదవ్‌ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. కొడుకు పుట్టలేదన్న కోపంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments