Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా అంజలీ.. లేచి నన్ను చూడు అంజలీ...

Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:46 IST)
కాళ్ళపారాణి ఆరకముందే ఓ నవవధువు మృత్యుఒడిలోకి చేరుకుంది. భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె చనిపోగా, భర్త గాయపడ్డాడు. ఈ హృదయ విదాకర ఘటన అనంతపురం జిల్లా హిందూపురం అర్బన్ ఏరియాలో జరిగింది.
 
ఈ ప్రమాద వార్తపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మడకశిర మండలం సీరాయపురానికి చెందిన పవన్‌కుమార్‌, అంజలీ హిందూపురంలోని కొటిపి లయోల పాఠశాలలో చదువుతున్న పవన్‌ సోదరుడిని చూసేందుకు ద్విచక్రవాహనంపై వచ్చారు. 
 
అతన్ని చూసిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పరిగి రోడ్డు కట్టకాలువ వద్ద హిందూపురం వైపు నుంచి మడకశిర వైపు వెళ్తుండగా వెనకాల నుంచి తమిళనాడుకు చెందినలారీ ఢీకొంది. దీంతో దంపతులిద్దరు కిందపడ్డారు. అయితే, అంజలి లారీ వెనుక చక్రాల కింద పడిపోయింది. దీంతో ఆమెపై లారీ ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత స్థానికులు గుర్తించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే కన్నుమూసింది. 
 
తన కళ్ల ముందే కట్టుకున్న భార్య మృతిచెందడంతో భర్త పవన్‌ కుమార్‌ రోదించిన తీరు వర్ణనాతీతం. తనను ఒంటరిగా వది వెళ్లిపోయావా.. లేచి నన్ను చూడు అంజలీ.. దేవుడా నన్నుకూడా తీసుకుపో.. అంటూ రోధించాడు. అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంట కన్నీరు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments