Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్నే పెళ్లాడుతానని పట్టుబట్టింది.. పెళ్లై, పిల్లలున్నారని చెప్పినా వినలేదు.. చివరికి?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:36 IST)
నిన్నే పెళ్లాడుతానని మరదలు పట్టుబట్టింది. ఇంకో వ్యక్తితో నిశ్చితార్థం జరిగినా.. మేనమామనే వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. తనకు పెళ్లై పిల్లలున్నారని చెప్పినా ఒప్పుకోలేదు. అంతే ఇక చేసేది లేక తన వెంటపడుతున్న మరదలిని కొట్టి చంపేశాడు మేనమామ. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, ధర్మవరంలోని నాగలూరు చెందిన నవ్యశ్రీ.. ఎంబీఏ పూర్తిచేసింది. 
 
అయితే కడప జిల్లా, ప్రొద్దుటూరు, తొండూరు మండలంలో దారుణ హత్యకు గురైంది. ఈమె హత్యకు గల కారణాలను పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు. 26 ఏళ్ల నవ్యశ్రీకి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. కానీ నగలు కొనేందుకు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లిన నవ్యశ్రీ.. మల్లెల ఘాట్ వద్ద హత్యకు గురైంది. నవశ్రీ చివరిగా మేనబావ జగన్మోహన్ రెడ్డితో కనిపించడంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. 
 
మేనమామంటే ఇష్టం పెంచుకున్న నవ్యశ్రీ.. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అయిష్టంగానే ఒప్పుకుందని.. మేనమామ జగన్ తనకు పెళ్లై పిల్లలున్నారని చెప్పినా ఒప్పుకోలేదని.. అందుకే ఎంత చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఆవేశంలో చంపేశానన్నాడు. బండరాయితో మోది నవ్యశ్రీని హతమార్చినట్లు పోలీసులకు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇందుకు అతని స్నేహితుడు రవి కూడా సాయం చేశాడు. 
 
హత్య తర్వాత ఏమీ తెలియనట్టుగా అందరితో తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం చెప్పాడు. జగన్ మోహన్ రెడ్డితో పాటు రవిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments