Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భార్య తెలివైనదైతే ఎన్ని కష్టాలో' : ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (13:11 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు సంస్థల అధిపతి. అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. దీనికి నిదర్శనం ఆయన ట్విట్టర్ ఖాతాను దాదాపు 60 లక్షల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ఆసక్తికర అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. ఒక్కోసందర్భంలో ఆయన చేసే ట్వీట్లు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా, తాను చదివిన ఓ వార్తను పట్టుకుని భార్య తెలివైనదైతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో... అంటూ తన భార్యను ఆట పట్టించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 62 యేళ్ల వ్యక్తి ఒకరు.. తన భార్య చెప్పే మాటలు వినాల్సి వస్తుదని భావించి వెవిటివానిగా, మాటలురాని మూగవాడిగా నటించాడు. దీనికి సంబంధించిన ఓ వార్త ఇటీవల పత్రికల్లో వచ్చింది. ఈ వార్త ఆనంద్ మహీంద్రా కంటపడింది. దాన్ని చదవగానే ఆయన కడుపుబ్బ నవ్వారు. అంతటితో ఆగకుండా తన భార్య అనురాధ వద్ద ప్రస్తావించాడు. 
 
'నేను కూడా నిన్ను ఇలాగే ఫూల్ చేస్తే ఏం చేస్తావ్' అంటూ సరదాగా ప్రశ్నించారు. 'నిజమా... సెల్‌ఫోన్‌లో మాట్లాడకుండా మీరు ఐదు నిమిషాలైనా ఉండగలరా?' అని భార్య అనురాధ అడిగారట. దాంతో ఆయన "తెలివైన  భార్య ఉంటే ఎన్ని ప్రమాదాలో" అని తమ మధ్య జరిగిన సంభాషణను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇక ఇది వైరల్ అవుతోంది. దీనికి వేల సంఖ్యలో లైక్స్, షేర్లు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments