Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల అదుపులో అమృతపాల్ పాల్ సింగ్ సతీమణి

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (09:29 IST)
సిక్కు వేర్పాటువాదనేత అమృత్‌పాల్ సింగి భార్య కిరణ్‌దీప్ కౌర్‌ దేశం వీడి పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆమెను పోలీసులు గుర్తించి విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ నేతగా ఉన్న అమృత్‌పాల్ సింగ్‌తోపాటు ఆయన అనుచరులపై పలు హత్యాయత్న కేసులు ఉన్నాయి. అలాగే, పోలీసులపై దాడి, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం, ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించడం ఇలా అనేక రకాలైన కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన సతీమణి అమృత్‌పాల్ భార్య భార్య కిరణ్‌దీప్ కౌర్ లండన్ వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు, అమృతసర్ విమానాశ్రయంలో మైగ్రేష్ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద అమృతపాల్ సింగ్ గురించి విచారణ జరుపుతున్నారు. 
 
ఇంగ్లండ్‌కు చెందిన కిరణ్‌దీప్ కౌర్... గత ఫిబ్రవరి 10వ తేదీన అమృత్‌పాల్ సింగ్ వివాహం చేసుకున్నారు. అమృతసర్‌లోని అమృతపాల్ పూర్వీక గ్రామంలో ఈ వివాహం సాధారణ పద్ధతిలో జరిగింది. ఈ వివాహం తర్వాత తన భార్య తనతో పంజాబ్‌లోనే ఉంటారని అమృతపాల్ సింగ్ ప్రకటించారు. కానీ, ఆమె దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments