Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీ విద్యార్థినిపై రెండేళ్లుగా అత్యాచారం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (14:59 IST)
కాలేజీ విద్యార్థినిపై ఇద్దరు కామాంధులు రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చారు. ఆ యవతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె నగ్నఫోటోలు తీసి వాటిని చూపి బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్‌కు చెందిన 20 ఏళ్ల యువతి ఏప్రిల్ 2019లో కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు.. వికాస్, భురు జాట్ అనే ఇద్దరు వ్యక్తులు అల్వార్‌లోని ఎస్‌ఎమ్‌డి సర్కిల్ నుంచి కిడ్నాప్ చేశారు. 
 
ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం యువతి అల్వార్‌లోని మలఖేరా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు కదా కనీసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
 
అయితే అత్యాచారం జరిగిన సమయంలో నిందితులు ఆ యువతిని నగ్నంగా వీడియో తీశారు. ఆ వీడియో చూపించి.. యువతిని బెదిరిస్తూ గత రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా జూన్ 25, 2021న గౌతమ్ సైనీ అనే వ్యక్తి.. యువతికి వీడియో పంపించి.. తనను కలవకపోతే వీడియో కుటుంబసభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. 
 
అయితే యువతి అతన్ని కలవకపోవడంతో.. వీడియోను సైనీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దాంతో బాధితురాలు జూన్ 28న పోలీసు సూపరింటెండెంట్ తేజస్విని గౌతమ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అల్వార్ జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఆ తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితులు వికాస్ మరియు భురు జాట్‌లను అరెస్టు చేశారు. అదేవిధంగా.. యువతిని వీడియో చూపించి బెదిరించిన మూడవ నిందితుడు గౌతమ్ సైనిని కూడా అరెస్టు చేశారు. 
 
అంతేకాకుండా, బాధితురాలి ఫిర్యాదును నమోదుచేయనందుకు పోలీసుల నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తు చేస్తామని.. వారు దోషులుగా తేలితే పోలీసు సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అల్వార్ సర్కిల్ అధికారి అమిత్ సింగ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఏదో నడుస్తోందా? (video)

ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా వారధి

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన టాలీవుడ్ ప్రేమజంట!!

సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి : నటి మాధవీలత

మెగాస్టార్‌కి ఐకన్ స్టార్‌కి అదే తేడా? అక్కడే దెబ్బ కొడుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments