Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలిండియా రేడియోలో లైంగిక వేధింపులు.. న్యూస్ రీడర్లు, యాంకర్లను..?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (11:28 IST)
ఆలిండియా రేడియోలో లైంగిక వేధింపుల కేసులు నమోదైనాయి. ఆలిండియా రేడియో అధికారిపై తొమ్మిది మంది మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆలిండియా రేడియో అధికారిపై తొమ్మిది మంది మహిళలు చేసిన ఆరోపణల్లో నిజం వుందని జాతీయ మహిళా కమిషన్ కూడా తేల్చేసింది. 
 
ఇందులో భాగంగా ఆలిండియా రేడియో అధికారిని డిమోట్ చేస్తున్నామని.. వేతనాన్ని కూడా తగ్గిస్తున్నామని మహిళా కమిషన్ వెల్లడించింది. అంతేగాకుండా మహిళా కమిషన్ చేసిన సిఫార్సులను ఏఐఆర్ క్రమశిక్షణా కమిటీ అంగీకరించింది. అతనిపై జరిమానాను విధించడంతో పాటు పే స్కేలును రెండు స్టేజ్‌లు తగ్గించేందుకు నిర్ణయించింది. 
 
ఇక ఆలిండియా అధికారిపై లైంగిక ఫిర్యాదులు చేసిన వారిలో న్యూస్ రీడర్లు, యాంకర్లు, ఇతర ఉద్యోగులు వున్నారు. నవంబర్ 12వ తేదీన సదరు అధికారిపై ఫిర్యాదులు అందాయి. ఆపై నేషనల్ ఉమెన్ కమిషన్ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ప్రసార భారతిలో లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. మహిళల భద్రతపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రసారాల మంత్రిత్వ శాఖ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం