Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలకనంద నదిలో పడిన మినీ బస్సు - ఒకరి మృతి - పలువురు గల్లంతు!

ఠాగూర్
గురువారం, 26 జూన్ 2025 (10:59 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రలోని రుద్రప్రయాగ జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 18 మంది ప్రయాణికులతో వెళుతున్న మినీ బస్సు ఒకటి అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో పది మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి ఏడుగురుని రక్షించారు. అలాగే, స్థానికులు మానవహారంగా నిలబడి గాయపడిన వారని కొండపైకి చేర్చారు. 
 
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. బస్సు కొండపైకి వెళుతున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చపేట్టారు. వీరిలో నదిలో నుంచి రక్షించిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
నదిలో గల్లంతైన మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments