Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయం కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలే : మాయావతి

ఎస్పీ ములాయం సింగ్ కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలేనని బీఎస్పీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ యూపీ ప్రజలను సమాజ్ వాదీ పార్టీ వెర్రివాళ్లను చేస్తోందన

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (10:12 IST)
ఎస్పీ ములాయం సింగ్ కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలేనని బీఎస్పీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ యూపీ ప్రజలను సమాజ్ వాదీ పార్టీ వెర్రివాళ్లను చేస్తోందని అన్నారు. 
 
వచ్చే సంవత్సరం యూపీ ఎన్నికల్లో గూండాలను వాడుకోవాలని ఎస్పీ చూస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ 2014లో ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ, ఆ హామీ ఏమైందని, బీజేపీ ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని పొందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో తమ పార్టీయే విజయం సాధిస్తుందన్న ధీమాను మాయావతి వ్యక్తంచేశారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న ఎస్పీలో గత కొన్ని రోజులుగా అంతర్గత కలహాలు తారా స్థాయికి చేరిన విషయం తెల్సిందే. దీంతో తండ్రీతనయులైన ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌ల మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గున మండిపోతోంది. దీంతో విపక్ష పార్టీలన్నీ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments